VSKN: సందడి చేస్తున్న ‘వేయి శుభములు కలుగు నీకు’ ట్రైలర్‌

రెడ్ బీ న్యూస్, 3 జనవరి 2022 ‌: నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్‌ రాథోడ్‌ దర్శకుడు. తమన్నా వ్యాస్‌ కథానాయిక. తూము నరసింహా పటేల్‌, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నటుడు సుధీర్‌బాబు ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. కామెడీ, థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తోంది. ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఓ ఇంటి నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందించారు. శివాజీరాజా, సత్యం రాజేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us