UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 8:30 PM
సామర్లకోట: సాక్షి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం క్రిక్ ప్లే స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో మండలంలోని ఉండూరు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లాస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించినట్లు చల్లారి కళ్యాణ్ తెలిపారు. ఓపెన్ కేటగిరిలో నిర్వహించిన చెస్ పోటీల్లో తమ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న ఆర్. రాబర్ట్ రాజు (ప్రథమ), బాపిరెడ్డి గంగాభవాని (ద్వితీయ) బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సాక్షి బ్రాంచ్ మేనేజర్ శివుడు, ఎడిషన్ ఇంచార్జ్ కృష్ణారావు, వైసీపీ కౌన్సిలర్ బి. జాన్ మోజెస్, ఉండూరు గ్రామ నాయకుడు కొప్పిశెట్టి రాధాకృష్ణ, తదితరులు అభినందించారు.







