Varalakshmi Vratam : ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

UPDATED 16th JULY 2022 SATURDAH 08:40 PM

Varalakshmi Vratam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా దేవాలయంలో జరిగే అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ వ్ర‌తం టికెట్లను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us