Updated 3rd February 2023 Friday 12:30 am
K Viswanath passes away : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ. సప్తపది, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వర్ణకమలం వంటి ఆణిముత్యాలు తీశారు కె.విశ్వనాథ్.
కె.విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కె విశ్వనాథ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.(K Viswanath)







