Kakinada Road accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది దుర్మరణం

Updated 14th May 2023 Sunday 3:10 pm

Kakinada Road  Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొ ఇద్దరు  చికిత్స పొందు ఆసుపత్రిలో మృతి చెందారు.. 

ప్రైవేట్ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

తాళ్లరేవు మండలం కోరంగి రోడ్డు ప్రమాద మృతులంతా యానాం ప్రాంతానికి చెందిన వారే..

కర్రి పార్వతి (42), మెట్టకూరు,

శెసెట్టి వెంకటలక్ష్మి (41) మెట్టకూరు,

కల్లి పద్మ (38) న్యూ బస్టాండ్ యానాం

నిమ్మకాయల లక్ష్మి (54) కురసాంపేట

చింతపల్లి జ్యోతి (39) వెంకట్ నగర్ యానాం

బొక్క అనంతలక్ష్మి (47) ఫ్రాన్స్ తిప్ప యానాం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us