UPDATED 8th FEBRUARY 2018 THURSDAY 6:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ గురువారం విజయవంతం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి నిరసనగా నిర్వహించిన బంద్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు, బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీనివాస్, విప్పర్తి కొండలరావు, కరణం గోవింద్, బత్తుల బాలాజీ, యువరాజు, బాలం సత్తిబాబు, దారబాని కృష్ణ, వీరబాబు, కరణం శ్రీనివాసరావు, బాలం హరి, స్మార్ట్ సామర్లకోట సభ్యులు,శ్యామ్, ఏసురాజు, ప్రిన్స్ రాజు, ఫణి తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన ఆద్వర్యంలో స్టేషన్ సెంటర్ వద్ద జనసేన కార్యకర్తలు కేంద్ర బడ్జెట్ పై యువత, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు), సుంకర కళ్యాణ్ దిలీప్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయ్, సరోజ్ వాసు తదితరులు పాల్గొన్నారు. అలాగే యూనియన్లకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకై రాష్ట్ర బంద్ కు నిరసనగా ఏపీయూడబ్ల్యూజె ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, గౌరవ అధ్యక్షుడు అడపా వెంకటరావు, నియోజకవర్గ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, కార్యదర్శి రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) తదితరులు బంద్ కు మద్దతు తెలియచేశారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ళ లక్ష్మీ నారాయణ, మేకా శ్రీను, సేపేని సురేష్, నేతల హరి, ఉబేదుల్లా, గొల్లపల్లి గంగ, చిట్టిమాని శ్రీనివాసరావు, జుత్తుక అప్పారావు, తలే సురేష్, రెడ్డి శ్రీనివాస్, వర్రే రవి, మందార భానుప్రసాద్, జగన్, జగ్గారావు, సుఖపట్ల సత్తిబాబు, పిల్లా సురేష్, చింతల బాబురావు, బాబ్జి, కమలరాజు, నల్లం బాబూరావు, గండి శివ, కరణం సురేష్, పితాని కృష్ణ, మంచం సాయి, వసంతాల ప్రసాద్, తదితరులు పాల్గోన్నారు.







