ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్ పి

UPDATED 13th AUGUST 2017 SUNDAY 6:00 PM

జగ్గంపేట: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆగష్టు 15 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్ పి విశాల్ గున్ని, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పరిశీలించారు. జగ్గంపేట-గోకవరం రోడ్డులో ఉన్న పోలవరం కాలువ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణాన్ని ఈ సందర్భంగా వారు పరిశీలించారు. సభావేదిక ఏర్పాట్లు , శిలాఫలకం, బారికేడ్లు, ప్రజలు వచ్చే మార్గాలు, మీడియాపాయింట్, వ్యవసాయశాఖచే  ఏర్పాటు చేయనున్న స్టాల్స్ తదితర పనులపై జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జునకు వారు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలు, విఐపిలు, మీడియాపాయింట్ ఎల్ ఈ డి స్క్రీన్స్ సౌండ్ సిస్టం మొదలైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ నెల 14 వ తేదీ సాయంత్రంలోగా మొత్తం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ హెలీప్యాడ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ విజయ రామరాజు, జెడ్పి చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, డీఆర్డీఏ పిడి మల్లిబాబు, వ్యవసాయశాఖ జెడి ప్రసాద్ బాబు, ఆర్&బి ఎస్ ఈ మూర్తి, డిఎం& హెచ్ ఓ చంద్రయ్య, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఓఎస్డీ రవిశంకర్, డిఎస్పీ చిలకా వెంకట రామారావు, తహసీల్దార్ శివమ్మ, ఎంపిడివో జి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us