Updated 1 February 2022 Tuesday 10:30 AM
పెడన (రెడ్ బీ న్యూస్): కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతి చెందిన వారిని కాసిన పద్మనాభం (52), నాగ లీలావతి (45), రాజనాగేంద్రం(24)గా గుర్తించారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







