TS News: అందరి సహకారంతోనే మహమ్మారిని ఎదుర్కోగలం: తమిళిసై

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 ‌: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సి్‌న్ వేసుకొని, మాస్క్‌ ధరించి ఒమిక్రాస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు. ఈ ఏడాది కొవిడ్‌ రహితంగా తయారవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 100శాతం వ్యాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us