అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్

UPDATED 28th MAY 2022 SATURDAY 08:00 PM

Konaseema : కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు. అమలాపురం అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్లర్లు, విధ్వంసం వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు 20 వాట్సప్ గ్రూపులను అందులోని సభ్యులను, 350 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ లను విశ్లేషిస్తున్నారు.

వీడియో క్లిప్పుంగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పుంగుల ఆధారంగా 70 మందిని గుర్తించారు. త్వరలో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని ఆయన తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us