భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

సామర్లకోట: 8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా సక్రమంగా చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, అలాగే ప్రతి భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి నెలకు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం చేయాలని కోరుతూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సామర్లకోట అధ్యక్షులు పెనుపోతుల సత్తిబాబు, మండల గౌరవాద్యక్షులు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఇసుక సరఫరా సరిగా లేక భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కోల్పోయారని, గత సంవత్సరం 20 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఇసుక సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని, లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన భవన కార్మికుల కు నెలకు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ప్రకృతి ఈశ్వరరావు, సీఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు బర్ల గోపాల్, టి.నాగమణి, నాయకులు తుంపాల శ్రీనివాస్, చిట్టిడి శ్రీను, దుళ్ల ప్రసాద్, బర్రే సత్తిబాబు, పెనుపోతుల శివ, పెదబ్రహ్మ దేవం కృష్ణ, దుర్గారావు, మాధవపట్నం గోవింద్, కనకారావు, బాలం సత్తిబాబు, బొమ్మిడి శ్రీను, కతిరి వెంకటేష్ పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us