UPDATED 16th AUGUST 2017 WEDNESDAY 10:30 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం 45 వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. అలాగే భద్రాచలం వేదపండితుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం, సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ సీతారామ కళ్యాణం, శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) తదితరులు పాల్గొన్నారు.







