సింధూకు సత్కారం

UPDATED 23rd JULY 2017 SUNDAY 9:00 PM

రాజమహేంద్రవరం: ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఆదివారం నగరంలో సందడి చేశారు. స్థానిక త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలోని కాస్మోపాలిటన్‌ క్లబ్‌లో షీ టీం ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు ఆమె బహుమతి ప్రదానం చేశారు. అనంతరం టెన్నిస్‌ కోర్టు ఆవరణలో మొక్క నాటారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు క్రీడాకారులు, చిన్నారులు పోటీ పడ్డారు. క్లబ్‌ కార్యదర్శి పరిమి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us