తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

UPDATED 15TH MAY 2017 MONDAY 7:00 PM

కాకినాడ: రానున్న 20 రోజుల్లో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బోర్‌వెల్స్‌ వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. దీని కోసం రూ.73.59 లక్షలు కేటాయించారని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 958 బోర్స్‌వెల్స్‌కు మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తేవాలని,  ఎండలు మండుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పంచాయతీల్లో 1,145 చలివేంద్రాలు ఏర్పాటు చేశారని, వీటిని పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం 11.30 గంటల లోపు పని ముగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 7.30 నుంచి 11 గంటల వరకూ మాత్రమే నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అందించటానికి వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యాపార సంస్థలు, తోపుడుబండ్లు ఎండలో నిర్వహించవద్దని సూచించారు. ఈ మేరకు ప్రజలు, వ్యాపారుల్లో అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడి నివారణకు ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ఆదేశించారు. రక్షిత మంచినీటి పథకాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us