UPDATED 14th APRIL 2022 THURSDAY 06:00 AM
Sexual Assault: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చక్కిడాల రాజా అనే యువకుడు తన ఎదురింట్లో ఉంటున్న చిన్నారిపై కన్నేశాడు. రోజూలాగే ఆ చిన్నారి తన తోటి వయసు చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా చిన్నారిని అతడి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
చిన్నారి గట్టిగా ఏడవడంతో యువకుడు చిన్నారిని బయటకు పంపిచేశాడు. దీంతో చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లడంతో తల్లి ఆరాతీసింది. దీంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై చిన్నారి తల్లి ఫిర్యాదు చేయడంతో దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా అత్యాచారానికి పాల్పడిన యువకుడు గతంలో ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.







