UPDATED 17th AUGUST 2017 THURSDAY 10:00 PM
జనసేన పార్టీలో రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి జనసేన విద్యార్థి విభాగం, జనసేన మహిళా విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని, వీటిని అక్టోబర్‌లో ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఒకవేళ అపుడు వీలుకాకపోతే ఈ ఏడాది చివరికి అమల్లోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తాను అక్టోబర్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.







