శాస్ర్తోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

తిరుమల (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శుక్రవారం ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముందుగా సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి భూవరాహస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించి, చక్రత్తాళ్వార్ల చక్రస్నానం వైభవంగా చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us