రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతాం

UPDATED 25th FEBRUARY 2018 SUNDAY 5:30 PM

జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్ ని కరువు రహితగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం పురుషోత్తపట్నం స్టేజ్-2 పంపింగ్ పనులను మంత్రి జగ్గంపేట, ప్రత్తిపాడు శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురుషోత్తపట్నం స్టేజ్-2 ను జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను కరువు రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని, నదుల అనుసంధానం ప్రక్రియ భారతదేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను 2019 నాటికి పూర్తిచేస్తామని, పట్టిసీమ, పురుషోత్తపట్నాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసి సాగునీరు అందించామని అన్నారు. రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ను ఈ జిల్లాకు ముఖ్యమంత్రి ఇచ్చిన వరం అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నామని, మన రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్ గా మార్చడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నీరు, స్థలం, విద్యుత్, రవాణా, సమృద్ధిగా ఉంటేనే పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనంతరం వైష్ణవవాణి భక్తి సమాచార పుస్తకాన్ని మంత్రి, శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.వి.ఎస్. అప్పలరాజు, వైస్ ఎంపిపి మారిశెట్టి భద్రం, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కొత్త కొండబాబు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us