విజయనగరం (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖకు తరలించారు. క్షతగాత్రులు మెంటాడ మండలం చింతాడవలస వాసులుగా గుర్తించారు. కిండాం అగ్రహారంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 35 మంది ఉన్నారు.







