కలుషితాహార బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించండి

UPDATED 24th OCTOBER 2017 TUESDAY 6:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై పెద్దాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర  హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరామర్శించారు. భాదితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ మోహన్ ను ఆదేశించారు. యల్లమిల్లి గ్రామంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మాంసాహారం తిన్న సుమారు 55 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో వారందరూ చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి వచ్చిన భాదితులతో మంత్రి మాట్లాడారు. విందు భోజనాల తయారీ విషయంలో నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. బాధితులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, ఆర్డీవో విశ్వేశ్వరరావు బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజాసూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ బొడ్డు బంగారుబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us