రెడ్ బీ న్యూస్, 9 జనవరి 2022: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. 2021లో విడుదలై సంచలనంగా మారింది. ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వందల సంఖ్యలో స్పూన్లు, రీమిన్లు దర్శనమిచ్చాయి. వేరే చిత్రాల్లోని డ్యాన్సు ఈ పాటను జతచేసిన వీడియోలు విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఈ పాట క్రేజ్ అలానే ఉందని ఇటీవల ఓ నెటిజన్ పంచుకున్న వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. వేల సంఖ్యలో లైక్స్, వందల సంఖ్యలో రీట్వీట్లు సంపాదించింది. ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని సీన్ ఇది. ఇందులోని ఇద్దరు నటుల స్టెప్పులకు 'నాటు నాటు' పాటను యాడ్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. నవ్వులు పంచుతోంది. 'సూపర్, 'పర్ ఫెక్ట్ రీమిక్స్', 'భలే ఉంది' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రమే ' ఆర్ఆర్. రాజమౌళి దర్శకుడు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.







