DGP: గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు: డీజీపీ సవాంగ్

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 01:20 PM

విశాఖపట్నం: గంజాయి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎస్ఈబీ కలిసి గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నాయని తెలిపారు. ఒడిశాలో 23 జిల్లాలు, విశాఖలో 11 మండలాల్లో గంజాయి సాగవుతోందన్నారు. ఏడాది నుంచి 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. ఆదాయం కోసం మావోయిస్టులు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. 3 నెలల వ్యవధిలో 500 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us