శివసదన్ నిర్మాణానికి భూమి పూజ

UPDATED 20th OCTOBER 2018 SATURDAY 6:00 PM

అన్నవరం: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి సన్నిధిలో దాతల సహకారంతో 138 వసతి గదులు నిర్మాణం శివసదన్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా శనివారం భూమిపూజ నిర్వహించారు. ముందుగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఐ.వి. రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో మారిశెట్టి జితేంద్ర, వేదపండితులు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాలతో మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం దాతల సహకారంతో వసతి గదుల నిర్మాణానికి చర్యలు ప్రారంభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మంత్రి దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us