Pushpa Movie: శ్రీవల్లీ పాటకి డాన్స్ అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్

Pushpa : అల్లుఅర్జున్, రష్మిక నటించిన ‘పుష్ప’ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఇందులోని సాంగ్స్, డైలాగ్స్ అయితే ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘పుష్ప’ సాంగ్స్ కి మామూలు సామాన్య జనం నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇక శ్రీవల్లి సాంగ్ కి అయితే ప్రపంచం నలుమూలల నుంచి రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకి చాలా మంది సినీ, టీవీ, క్రికెట్ సెలబ్రిటీలు రీల్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ హీరోయిన్ ఈ సాంగ్ కి రీల్ చేశారు.

శ్రీవల్లి హిందీ వర్షన్ సాంగ్ కి బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ ఆదిల్ ఖాన్, బాలీవుడ్ భామ డైసీ షా క‌లిసి డ్యాన్స్ చేశారు. ముందుగా బ్లాక్ డ్రెస్‌లో ఆదిల్ ఖాన్‌, డైసీ షా పాటని ప్రాక్టీస్ చేసి, ఆ త‌ర్వాత పుష్ప‌రాజ్‌, శ్రీవ‌ల్లి గెట‌ప్ లోకి మారి డ్యాన్స్ చేశారు.

అయితే వీరిద్దరూ పుష్ప రాజ్, శ్రీవల్లి గెటప్స్ లో అచ్చు దింపేశారు. ఆ గెటప్స్ వీరికి బాగా సూట్ అయ్యాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆదిల్ ఖాన్‌, డైసీ షా డ్యాన్స్ చూస్తే నిజంగా పుష్ప‌రాజ్‌, శ్రీవ‌ల్లి క‌లిసి డ్యాన్స్ చేశారా అన్న‌ట్టుగా ఉందని అంటున్నారు. అయితే స్టెప్స్ ని వీరికి తగ్గట్టు మార్చుకొని కొత్తరకంగా కూడా వేశారు. సోషల్ మీడియాలో ఇపుడు వీరు చేసిన ఈ డ్యాన్స్ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us