శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: న్యూస్‌టుడే: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతూ పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలోనే తూలి పడిపోయాడు. పిల్లలు అతన్ని ‘లేవండి సారు...’ అంటూ బతిమిలాడినా ఫలితం లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యారు. కనీసం నిల్చోలేని స్థితిలో నేలపైనే కూర్చుండిపోయాడు. విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఉండి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ మరో ఉపాధ్యాయురాలు ఉండగా ఆమె సెలవులో ఉన్నారు. ఎంఈవో దుర్గారావు మాట్లాడుతూ... ప్రధానోపాధ్యాయుడిపై గతంలో ఒకసారి ఫిర్యాదు అందిందని, డీఈవోకు నివేదికను ఇచ్చామన్నారు.







