గ్రామాల్లో నూరుశాతం అభివృద్ధి పనులు

UPDATED 19th APRIL 2018 THURSDAY 6:00 PM

పెద్దాపురం: గ్రామాల్లో నూరుశాతం అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని పులిమేరు గ్రామం హరిజన పేటలో రూ. 33.83 లక్షలతో చేపడుతున్న ఐదు కల్వర్టులకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ హరిజనపేటలో ఎన్నో సంవత్సరాలుగా కల్వర్టులు శిధిలావస్థలో ప్రమాదకరంగా ఉండటంతో వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో అవసరాలు మేరకు పనులను గుర్తించి నూరుశాతం పూర్తి చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా హరిజన పేటలో సి.సి.రోడ్లు నిర్మించామని, అలాగే కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. త్రాగునీరు ట్యాంకు ఏర్పాటు చేస్తామని, ఎన్.టి.ఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద అర్హులకు ఇళ్ళును మంజూరు చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందచేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాల ఆదుకోవడానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందు హరిజన పేటలోని అంబేథ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), తుమ్మల బుల్లెయ్య, తుమ్మల నాని, ఇరిగేషన్ జె.ఇ పద్మజ, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us