పెద్దాపురం డీఎస్పీగా రామారావు బాధ్యతలు స్వీకరణ

UPDATED 12th JULY 2017 WEDNESDAY 2:00 PM

పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా చిలకా వెంకట రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కాకినాడ ఇంటిలిజెన్స్ విభాగం నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు డీఎస్పీ గా పనిచేసిన ఎస్. రాజశేఖరరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రామారావు ఇక్కడకు వచ్చారు. ఈ సంధర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే కేసుల పరిస్థితిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన డీఎస్పీ రామారావు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే సీఐ ప్రసన్నవీరయ్య గౌడ్, ఎస్ ఐ కృష్ణ భగవాన్, డివిజన్లోని సీఐలు, ఎస్ ఐ లు డీఎస్పీ ని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us