UPDATED 25th JUNE 2017 SUNDAY 5:00 PM
పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ మన పెద్దాపురం ఫేస్ బుక్ సభ్యులు నడుం బిగించారు. క్లీన్ ఆర్మీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాలుగవ వార్డు పరిధిలో డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడంతో పాటు రామారావు పేటలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు గ్రూప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పరిశుభ్రతా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపల్లి సతీష్ కుమార్ , మహమ్మద్ లతీఫ్, వంశీ కృష్ణ, నెక్కల భుజంగరావు , వంగలపూడి శివకృష్ణ, కొల్లి దుర్గాప్రసాద్, సత్యప్రవీణ్ , రక్షణకుమార్, శంకర్, సంజీవ్, పెదిరెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు







