UPDATED 18TH MAY 2017 THURSDAY 1:00 PM
పెద్దాపురం: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) అన్నారు. మండలంలోని రాయభూపాలపట్నం గ్రామంలో క్రిస్టియన్ లేపరర్స్ అండ్ పాస్టర్స్ సొసైటీ (క్లాప్స్) అధ్యక్షుడు లంక పురుషోత్తం దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ శిబిరంలో సుమారు 180 మందికి వైద్య పరీక్షలను నిర్వహించి, 35 మందిని ఆపరేషన్స్ కు ఎంపికచేశారు. అలాగే వారికి ఉచితంగా మందులు,కళ్ళజోళ్ళు అందచేశారు. ఈ శిబిరంలో కిరణ్ నేత్ర వైద్యశాల వైద్యులు డాక్టర్ నరేష్ వైద్య బృందం తమ సేవలను అందించారు.ఈకార్యక్రమంలో క్లాప్స్ ఉపాధ్యక్షుడు వైఆర్ మన్నా, కార్యదర్శి ఎంయస్ గిద్యోను, కోశాధికారి పి. జాన్ బాబు, కె. సత్యానందం, కె. రాజారావు, విల్సన్ పాల్, బోస్, సుకుమార్, భాస్కరరావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.







