ప్రతీ గ్రామం పొగరహితం కావాలి

UPDATED 23rd MAY 2017 MONDAY 7:30 PM

పెద్దాపురం : రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని పొగరహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మండలంలోని కాండ్రకోట గ్రామంలో దీపం పథకంలో భాగంగా మహిళలకు ఆయన చేతుల మీదుగా గ్యాస్ స్టవ్ లను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామాన్ని పొగరహితంగా తీర్చిదిద్ధేందుకు టిడిపి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చాలావరకు గ్రామాలను పొగరహితంగా తీర్చిదిద్దినట్లు ఆయన  పేర్కొన్నారు. అనంతరం ఎఎంసి వైస్ ఛైర్మన్, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని మాట్లాడుతూ మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఈ పథకంలో భాగంగా గ్యాస్ స్టవ్ లను అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్టవ్ లను పంపిణీ చేశారు. అలాగే నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక  పూజలను చేశారు. అలాగే సుమారు 100 మంది టిడిపి పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), ఎంపిపి గుడాల రమేష్, మండల టిడిపి  అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు,  జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సీనియర్ టిడిపి నాయకుడు పచ్చిపాల సత్తిబాబు, సర్పంచ్ కుంచే గాంధీ, ఉపసర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us