అన్నవరం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: అన్నవరం సత్యనారాయణ స్వామికి ఆదివారం కోటి తులసి దళార్చన (సేవా కైంకర్యం) కనులపండువగా నిర్వహించారు. లోక కల్యాణార్థం, రైతు సంక్షేమం కోసం విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామివారికి తులసీ దళాలతో అర్చన చేశారు. వార్షిక కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అలంకరించారు. వైదిక బృందం ఆధ్వర్యంలో స్వామివారికి దళార్చన చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో రెండు బృందాలుగా పూజలు నిర్వహించారు. నిత్యాన్నదానంలో భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.







