హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: రామ్‌చరణ్ - తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది. తారక్ - చరణ్‌ల పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయిన ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.







