UPDATED 29 MARCH 2022 TUESDAY 10;:00 PM
Bank Holidays April 2022 : ఏప్రిల్ నెలలో మీకు బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవు రానుంది. అందుకు అనుగుణంగా బ్యాంకు ఖాతాదారులు తమ పనులను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇకపోతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది.
దేశంలో పలు రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల సంఖ్యలో కాస్తంత మార్పు ఉన్నా.. బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవు మాత్రం ఖాయమే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏకంగా 11 రోజుల పాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులు మూత పడనున్నాయి. (Bank Holidays April 2022) ఏప్రిల్ 1- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 2- ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, అంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి. ఏప్రిల్ 3- ఆదివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు) ఏప్రిల్ 9- రెండో శనివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 10- ఆదివారం (సాధారణ సెలవు) (Bank Holidays April 2022) ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్, బోగ్ బిహు.
దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు..
ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్, హిమాచల్ డే, విషు(దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు) ఏప్రిల్ 16- బోగ్ బిహు ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 21- గరియా పూజ ఏప్రిల్ 23- నాలుగో శనివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 29- శాబ్-ఐ-ఖదర్/ జుమాత్-ఉల్-విదా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు.. ఏప్రిల్ 1- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే. ఏప్రిల్ 2- ఉగాది (తెలుగు నూతన సంవత్సరం) ఏప్రిల్ 3- ఆదివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 9- రెండో శనివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 10- ఆదివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి(Bank Holidays April 2022) ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 17- ఆదివారం (సాధారణ సెలవు) ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 24- ఆదివారం (సాధారణ సెలవు) సో, బ్యాంకు కస్టమర్లు.. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఇకపోతే, బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని ఆన్లైన్ లావాదేవీలు 24 గంటలూ పని చేస్తాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్డ్రా చేసుకునే వీలుంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి.