AP News: ఏపీ హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన

అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021 : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర చేతుల మీదుగా శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్‌ అసోయేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదనపు భవనాన్ని G+5సామర్థ్యంతో నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాలను ఉన్నతాధికారులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us