AP News: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ భేటీ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇద్దరు చర్చించారు. వ్యవసాయ పంటలకు మంచి ధరలు కల్పించేలా పెట్టుబడులు దోహదపడాలని సీఎం సూచించారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలంగా స్పందించారు. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us