Kiara Advani: చరణ్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వసుమతి!

UPDATED 12th JULY 2022 TUESDAY 10:00 PM

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తన నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకోబోతుంది.ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాడు హీరో రామ్ చరణ్. కాగా, తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అందాల భామ కియారా అద్వానీ కూడా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది.

ఈ సినిమాను దర్శకుడు శంకర్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కియారా పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ సినిమాలో భారీ తారాగణం ఉండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

జూలై 13 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us