ఉపాధి కూలీలకు రూ.200 వేతనం ఇవ్వాలి

UPDATED 19th APRIL 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఉపాధి కూలీలకు ప్రతి కుటుంబానికి రూ.200 వేతనం ఇవ్వాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వి. విశ్వేశ్వరరావు డివిజన్ పరిధిలోని ఎంపిడివో, ఎన్.ఆర్.జి.ఎస్ అధికారులు,  సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం వర్క్ షాప్ ను గురువారం ఆర్డీవో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల ప్రకారం ఉపాధిహామీ పథకం అమలుపై ఇచ్చిన సూచనలను సంబంధిత అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని, అమలుచేయని వారిపై చర్యలకు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది వేతనాలు చెల్లింపు కోసం వచ్చే మూడు నెలల్లో డివిజన్లో 60 శాతం పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని, ఉపాధి పనులు వేతనం రూ.200 దాటి ఉండాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని తెలిపారు. జిల్లాలో పెద్దాపురం డివిజన్ 64వ స్థానంలో ఉందని, సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. డివిజన్ పరిధిలో తొండంగి, రంగంపేటలలో సరాసరి వేతనం రూ.192 ఉందని దీనిని పెంచాలని, గండేపల్లి, రౌతులపూడి మండలాల్లో రూ.200 దాటి ఉన్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రణాళికబద్దంగా వెళితే ఇచ్చిన టార్కెట్ ను పూర్తిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిడిలు రంగనాయకులు, జగదాంబ, ఎంపిడివోలు, ఎపివోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఇసిసిలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us