ఎఫ్ సి ఐ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు

UPDATED 21st JANUARY 2018 SUNDAY 6:00 PM

సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక ఎఫ్ సి ఐ రోడ్డులో ట్రాఫిక్ కారణంగా ఉదయం  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు భారీ వాహనాల కారణంగా రేగుతున్న దుమ్ముతో చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీలు, ట్రాక్టర్లు ఎఫ్ సి ఐకి రోజూ రావడంతో ఆ రోడ్డులోనే మెక్లారిన్ స్కూల్ ఉండడంతో  పిల్లలు ఆటోల్లో ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వలన సమయానికి వెళ్లలేకపోతున్నారు. దీని గురించి ప్రిన్సిపాల్ లీజియన్ తో వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ కో- ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు చర్చించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి. రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, టౌన్ సెక్రటరి సేపేని సురేష్, యూత్ సభ్యుడు గంప శివ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us