AP News: ఏపీలో అరాచక పాలన సాగుతోంది: కేంద్రమంత్రి మురళీధరన్

Updated 24 January 2022 Monday 13.00 PM

కడప (రెడ్ బీ న్యూస్) : జిల్లాలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి మురళీధరన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అశాంతి నెలకొందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారని, ఏపిలో ఇస్లామిక్ పండమెంటల్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారని, దీనికి సీఎం బాధ్యత వహించాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us