Shocking incident : కదిలే కారులో అకస్మాత్తుగా మంటలు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!

UPDATED 10th JUNE 2026 9:00 AM

కాకినాడ, రెడ్ బీ న్యూస్, జూన్ 10 : కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దహనమైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

​అసలేం జరిగిందంటే..?

​పిఠాపురానికి చెందిన గరగా అనిల్‌కుమార్ అనే వ్యక్తి తన కారులో ఏసీ పనిచేయకపోవడంతో మంగళవారం ఉదయం కాకినాడలోని ఒక మెకానిక్ షెడ్‌కు తీసుకువచ్చారు. అక్కడ రేడియేటర్ క్లీన్ చేయించాలని సిబ్బంది సూచించడంతో, ఆయన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మరో దుకాణంలో ఆ పని చేయించారు. అనంతరం కారును తిరిగి మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్తుండగా, భానుగుడి జంక్షన్ వద్దకు రాగానే వాహనం నిలిచిపోయింది.

​అనుమానం వచ్చి అనిల్‌కుమార్ కారు ఆపి, బానెట్ తెరిచి చూశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుండి దట్టమైన పొగలు వచ్చి, చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

​రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

​సమాచారం అందుకున్న సాలిపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు

​ఆస్తి నష్టం అంచనా : ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదవడంతో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.​షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కాకినాడ టూటౌన్ సీఐ ఎం.అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us