నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయుష్ శాఖ స్పందించి. “ఆనందయ్య మందుతో 48 గంటల్లో ఒమిక్రాన్ తగ్గిస్తామంటూ మంటూ సోషల్ మీడియాతో ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు ఇస్తున్నట్టు తెలిసింది. మందుల తయారీకి ఆనందయ్య అనుమతి తీసుకోలేదు. ఆయుర్వేద మందులుగా ఆనందయ్య పేర్కొనడం చట్టవిరుద్ధం. ఒమిక్రాన్ పేరిట మందు ఇవ్వకూడదని తెలిపాం. ఆనందయ్య వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉంటే ఇవ్వాలని తెలిపాం. ఇమ్యూనిటీ కోసం ఆయుష్ శాఖలో ఔషధాలున్నాయి” అని ఆయుష్ శాఖ కమిషనర్ రాములు తెలిపారు.







