బిర్యానీలో మిడతలు

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: బిర్యానీ తిందామని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన యువకుడు ఆన్ లైన్ లో సామర్లకోట బస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఓ పాస్ట్ ఫుడ్స్ సెంటర్ లో బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ డెలివరీ తీసుకుని తిందామని ప్యాకెట్ ఓపెన్ చేసిన ఆ యువకుడికి బిర్యానిలో మీడత ఉండటం, బిర్యానీ దుర్వాసన రావడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే ఫాస్ట్ ఫుడ్ పార్సిల్ కౌంటర్ కు వెళ్లి ఇదేంటని ప్రశ్నించగా నీ దిక్కున్నచోట చెప్పుకోమని సంబంధిత రెస్టారెంట్ నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పడంతో బాధిత యువకుడు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే సదరు రెస్టారెంట్ పై తరచు ఆరోపణలు వస్తునప్పటికి ఆహార నియంత్రణ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us