రెడ్ బీ న్యూస్:కరోనా అనే పేరు వింటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికీ ఫేస్‌కి మాస్క్‌లు, శానిటైజర్లు చేతుల్లోనే పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా మందు కనిపెట్టని ఈ మహమ్మారి.. దాదాపు 7 నెలలుగా ప్రజలను భయపెడుతూనే ఉంది. చిన్న, పెద్ద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ భయాందోళనలకు గురి చేసిన ఈ మహమ్మారి.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవిని తాకినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే ఎటువంటి లక్షణాలు ఆయనకు లేవని, కనిపించలేదని తెలిపారు. దీంతో రెండు రోజుల వరకు వెయిట్ చేసినా.. తనలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో.. అనుమానం వచ్చి.. మరోసారి మెగాస్టార్ టెస్ట్ చేయించారు. అక్కడ నెగిటివ్ రావడంతో.. దానినే ఫైనల్‌గా తీసుకోకుండా.. ఇంకా రెండు చోట్ల టెస్ట్‌లు చేయించారు. అక్కడ కూడా నెగిటివ్ రావడంతో.. తనకు పాజిటివ్ చూపించిన కిట్ సరిగా లేదనే నిర్థారణకు వచ్చినట్లుగా చెబుతూ.. తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు.