Telangana : పద్మశ్రీ గ్రహీతలకు కేసీఆర్ భారీ నజరానా

Updated 1 February 2022 Tuesday 09:15 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): పద్మశ్రీ రామచంద్రయ్యకు నజరానాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, నిర్మాణం కోసం రూ. కోటి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను రామచంద్రయ్య కలిశారు. ఆదివాసీ కళను బతికిస్తున్న రామచంద్రయ్యను కేసీఆర్ అభినందించారు. డోలు వాద్యంలో ప్రతిభ కనబరిచినందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రామచంద్రయ్యకు పద్మ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా పద్మశ్రీ కనకరాజుకు రూ. కోటి నజరానాను కేసీఆర్ ప్రకటించారు. గతేడాది గుస్సాడీ నృత్య కళాకారుడైన కనకరాజుకు పద్మ అవార్డు వరించింది. ఈ క్రమంలో కనకరాజుకు ఇంటి స్థలం, నిర్మాణం కోసం రూ. కోటి నజరానా ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కిన్నెరమెట్ల కళాకారుడు మొగలియ్యకు నజరానా ఇచ్చిన విషయం తెలిసిందే.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us