కోల్‌కతా (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 7 : బెంగాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల యువకుడు వీడియో కాల్ మాట్లాడుతుండగానే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. జల్పాయిగుడి జిల్లాలోని రాణినగర్ బీఎస్‌ఎఫ్ క్యాంపు ప్రాంతం పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తీస్తా నదిలో దూకేసిన ఆ యువకుడిని ధీరజ్ ప్రజాపతిగా గుర్తించారు. యువకుడి ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. గర్ల్‌ఫ్రెండ్‌తో వాగ్వాదం జరగడం వల్లే ఆకస్మికంగా నదిలోకి దూకేశాడని స్థానిక వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.







