AP News: ఏపీలో కొత్తగా 13,212 కరోనా కేసులు.. ఐదుగురి మృతి

UPDATED 21 JANUARY 2022 FRIDAY 17:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,942 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో 1,581 అనంతపురంలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులో నమోదయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us