UPDATED 26th MAY 2017 FRIDAY 4:00 PM
పెద్దాపురం: స్థానిక షాహీ జామియా మస్జిద్ (పెద్ద మస్జిద్) లో జుమానమాజ్ అనంతరం ముస్లిం సోదరుల కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్ షాహీ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముక్తార్ అలీ మాట్లాడుతూ శనివారం ఇషా నమాజ్, ప్రత్యేక తరవీహ్ నమాజ్ లతో ప్రారంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను ప్రతి ముస్లిం విధిగా పాటించాలని అన్నారు. ముస్లిం సోదరులు నమాజ్, ఉపవాసాలను ఆచరిస్తూ పవిత్ర మాసంలో విధిగా నిర్ణయించబడిన " జకాతుల్ ఫిత్రా" ధన సంపత్తులు గల ముస్లిం "జకాత్ ( విధిదానం) ను నిరుపేద ముస్లింలకు విధిగా చెల్లించాలన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి విచ్చేసిన హఫీజ్ చే "తరవీహ్ నమాజ్" ప్రార్ధనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మస్జిద్ ఇమాం అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, అధిక సంఖ్యలో ముస్లిం యువత, ఎంఎల్ ఆలీ సోదరులు, ఎస్.కె. రఫీ, బాబులాల్, షబ్బీర్ హుస్సేన్, జలీల్, జాకీర్, రిజ్వాన్, నబి పాల్గొన్నారు.







