సత్యదేవునికి రూ.18.96 కోట్ల ఆదాయం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పవిత్ర కార్తికంలో సత్యదేవుని సన్నిధిలో 1,28,509 వ్రతాలు.. వందల్లో వివాహాలు జరిగాయి. ఫలితంగా అన్నవరం దేవస్థానానికి కాసుల వర్షం కురిపించింది. అన్ని విభాగాల ద్వారా రూ.18.96 కోట్లు సమకూరాయి. నిరుడు కేవలం రూ.10.86 కోట్లు మాత్రమే వచ్చింది. 2019లో రూ.16.24 కోట్లు సమకూరింది. ఆన్‌లైన్‌ సేవలకు స్పందన: నేరుగా అన్నవరం వచ్చే అవకాశం లేని భక్తులు పరోక్ష పద్ధతిలో ఆన్‌లైన్‌ పూజల్లో పాల్గొన్నారు. 711 వ్రతాలు, 38 కల్యాణాలు, 29 ఆయుష్యహోమం, 12 చండీహోమం, 28 ప్రత్యంగిర హోమ పూజలు జరిగాయి. వెరసి రూ.9.69 లక్షలు సమకూరింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us