Mahesh Bank: మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్.. రూ.12కోట్లు మాయం

Updated 24 January 2022 Monday 19:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): సైబర్ నేరగాళ్ల దోపిడీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్ సర్వర్ నే హ్యాక్ చేశారు. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. మరోవైపు మహేష్ బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయిందో ఆ వివరాలను పరిశీలిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us