UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 6:30 PM
పెద్దాపురం: స్థానిక మహారాణి కళాశాలలో హిందీ భాషా దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆశాలత పీటర్ అధ్యక్షతన జరిగిన హిందీ దివస్ వేడుకలలో ప్రముఖ హిందీ అధ్యాపకులు డాక్టర్. కె. నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. జాతీయ సమైక్యత, జాతీయభావాన్ని పెంపొందించేందుకు హిందీ ఎంతగానో తోడ్పడుతోందని, రాజ్యాంగంలోని 360 ఆర్టికల్ అనుసారంగా హిందీని జాతీయభాషగా గుర్తించారన్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 14 న హిందీ భాషా దివస్ (హిందీ భాషా దినోత్సవం)ను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వీరయ్య చౌదరి, హిందీ విభాగాధిపతి ఎన్.వి.రమణ, కామర్స్ విభాగాధిపతి, కె.ఎస్.ఆర్.కె. చౌదరి, ఫిజిక్స్, తెలుగు విభాగాధిపతులు ధరణాలకోట గంగాధరుడు, ధర్మరాజు, హిందీ మాస్టర్ ఐ.సాయి శివరాజు పాల్గొని హిందీ భాషా ప్రాముఖ్యంపై ఉపన్యసించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని హిందీ భాష యొక్క ప్రాముఖ్యం దాని అవసరం, ఆవశ్యకతలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి. జ్యోతిర్మయి, ఐ.అచ్చిరెడ్డి, సత్యనారాయణమూర్తి, జి.రమేష్, శ్రీధర్, కృష్ణారావు, జి.ఎం.డి.రావు, జయలక్ష్మి, చక్రవేణి, ఎస్. సూర్యనారాయణ, లైబ్రేరియన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







